: అమెరికన్లలా ఆ కలను మనమూ సాకారం చేసుకుంటాం!: ముఖేష్ అంబానీ
దేశంలోని అడుగడుగూ డిజిటల్ పరిధిలోకి రావాలని 20 ఏళ్ల నాడు అమెరికన్లు కన్న కల నిజమైందని, అంతకన్నా తక్కువ సమయంలోనే భారతీయులు పూర్తి స్థాయి డిజిటలైజేషన్ ను చూడనున్నారని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్త డిజిటలైజేషన్ కు ఇండియా రెండు దశాబ్దాల సమయం తీసుకోదని ఆయన అంచనా వేశారు. వందలాది మంది షేర్ హోల్డర్లను ఉద్దేశించి వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన ఆయన, 4జి ఎల్టీఈ (లాంగ్ టర్మ్ ఎవల్యూషన్) తరంగాలు 'డిజిటల్' కలను సాకారం చేయనున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే, వచ్చే మూడు నాలుగేళ్లలోనే దేశమంతటా పూర్తి డిజిటలైజేషన్ సాధ్యమవుతుందని అంచనా వేశారు.