: ఇక 10 రోజుల్లోనే అనుమతులు...తెలంగాణ పారిశ్రామిక విధానం విడుదల
పెట్టుబడులను ఆకర్షించడంలో తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పడ్డ ఈ పోటీ నానాటికీ తీవ్రతరమవుతోంది. తమ రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు కేవలం నెల వ్యవధిలోనే అన్ని అనుమతులను సింగిల్ విండో పద్దతిలో అందించనున్నట్లు ఏపీ సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా కొత్త రాష్ట్రం తెలంగాణ కూడా తన పారిశ్రామిక విధానాన్ని ‘ఐపాస్’ పేరిట రూపొందించింది. కొద్దిసేపటి క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ దీనిని ఆవిష్కరించారు. ఈ విధానం ప్రకారం కొత్త పరిశ్రమలకు అవసరమయ్యే అనుమతులన్నీ కేవలం 10 రోజుల్లోనే ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అది కూడా సింగిల్ విండో పధ్ధతి ద్వారానే అనుమతులు జారీ కానున్నాయట.