: వేధింపుల ‘ఖాకీ’ని ఈడ్చికొట్టిన మహిళ... యూపీలో కేసు నమోదు
అతడో పోలీసు అధికారి. విధి నిర్వహణ మరిచాడు. పశువుగా మారాడు. కనిపించిన ఓ మహిళను పట్టపగలు వేధింపులకు గురి చేశాడు. అయితే, గతి తప్పిన ఖాకీని చూసి ఆ మహిళ ఏమాత్రం భయపడలేదు. కరుడు గట్టిన ఖాకీ నుంచి తనను తాను రక్షించుకుంది. అంతటితో ఆగని ఈ ధీర వనిత ఖాకీ కాలర్ పట్టుకుని ఈడ్చి కొట్టింది. ఈ తతంగమంతా ఓ అపార్ట్ మెంట్ లో జన సంచారం లేని ప్రదేశంలో జరిగింది. జనమెవ్వరూ లేరని గ్రహించిన సదరు పోలీసు అధికారి మహిళపై వేధింపులకు బరితెగించాడు. తీరా మహిళ తిరగబడటంతో అక్కడికొచ్చిన జనం సమక్షంలోనే ఆ పోలీసు అధికారి ఆ మహిళ చేతిలో తన్నులు తిన్నాడు. ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ లో చోటుచేసుకున్న ఈ ఘటన మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డైంది. ఘటన అనంతరం మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వేధింపుల పోలీసు అధికారిపై కేసు నమోదు చేశారు.