: రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడి... రెండేళ్లలో ఫలాలు: షేర్ హోల్డర్లకు ముఖేష్ అంబానీ భరోసా
వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో రూ. 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తవుతాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ భవిష్యత్ లక్ష్యాలను ఆయన తెలిపారు. దేశంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లిస్తున్న సంస్థ తమదేనని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 6,124 కోట్ల పన్ను చెల్లించామని ఆయన తెలిపారు. తమ ప్రాజెక్టులు పూర్తయిన తరువాత 2016-17 సీజన్ నుంచి పెట్టుబడుల ఫలాలు ఇన్వెస్టర్లకు అందడం ప్రారంభమవుతుందని ఆయన అంచనా వేశారు. రిలయన్స్ డిజిటల్, వరల్డ్ తదితర స్టోర్లు దేశవ్యాప్తంగా 900 నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు.