: నేపాల్ లో మళ్లీ భూకంపం... ఉలిక్కిపడ్డ ప్రజలు
నేపాల్ ను భూకంపం వెంటాడుతోంది. ఏప్రిల్ 25న భారీ భూకంపం వచ్చిన తరువాత కూడా స్వల్ప భూప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. గత అర్ధరాత్రి దాటిన తరువాత నేపాల్ లో భూకంపం సంభవించింది. ఖాట్మండుకు 65 కిలోమీటర్ల దూరంలోని సింధుపాల్ చౌక్ జిల్లాలో భూకంపం వచ్చినట్టు తెలిసింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. ఇప్పటికే ప్రాణభయంతో ఉన్న నేపాలీలు తాజా భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఎలాంటి ప్రాణనష్టంగానీ, ఆస్తినష్టంగానీ చోటుచేసుకోలేదని అధికారులు తెలిపారు.