: ఖైరతాబాద్ భారీ గణేశుడి నిర్మాణ పనులకు నేడు పూజ
ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ లోని ఖైరతాబాద్ భారీ గణపతి నిర్మాణ పనులు నేటినుంచి ప్రారంభమవుతున్నాయి. సర్వేశ ఏకాదశి సందర్భంగా గ్రంథాలయ ప్రాంగణంలో ఈరోజు కర్ర పూజ నిర్వహిస్తున్నట్టు గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్ తెలిపారు. ప్రతి ఏడాది ఇదే రోజున వినాయకుడి విగ్రహ తయారీకోసం కర్ర పూజను నిర్వహించడం ఇక్కడ ఆనవాయతీగా వస్తోంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు ఆ పూజకు మంత్రి పద్మారావ్ గౌడ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, పలువురు ప్రముఖులు పూజకు హాజరవుతారని తెలిపారు.