: ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ను అడ్డుకున్న ఏబీవీపీ... ఎస్వీయూలో ఉద్రిక్తత


ఏపీలో ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ కు ఆదిలోనే అవరోధం ఎదురైంది. ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో సీట్లను తగ్గించారని ఆరోపిస్తూ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నేటి ఉదయం ప్రారంభమైన కౌన్సిలింగ్ ను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అదికారులు, విద్యార్థి సంఘం నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి ముందస్తు ప్రకటన ఇవ్వకుండా సీట్ల కుదింపుపై ఎలా నిర్ణయం తీసుకుంటారని కౌన్సిలింగ్ కు హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఏబీవీపీ వాదనకు మద్దతుగా నిలిచి అధికారులను నిలదీశారు. దీంతో కౌన్సిలింగ్ నిలిచిపోయింది.

  • Loading...

More Telugu News