: మూడో రోజు షకీబ్ కు దొరికిపోయిన ధావన్
ఢాకాలో జరుగుతున్న భారత్-బంగ్లా టెస్టు మ్యాచ్ లో ఎట్టకేలకు బంగ్లా బౌలర్లు తొలి వికెట్ తీయగలిగారు. క్రీజులో కొరకరాని కొయ్యగా మిగిలిన శిఖర్ ధావన్ ను బంగ్లా ఆటగాడు షకీబ్ అల్ హసన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. షకీబ్ వేసిన 67వ ఓవర్ 5వ బంతిని డిఫెన్స్ ఆడబోయిన ధావన్ అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ తొలి వికెట్ ను 283 పరుగుల వద్ద కోల్పోయింది. ధావన్ 195 బంతుల్లో 23 ఫోర్ల సాయంతో 173 పరుగులు చేశాడు. అంతకుముందు మరో ఓపెనర్ మురళీ విజయ్ కూడా సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం విజయ్ 109 పరుగుల (213 బాల్స్, 10 ఫోర్లు, ఒక సిక్స్) వద్ద ఉన్నాడు. ప్రస్తుతం భారత స్కోరు 68 ఓవర్లలో 284/1.