: 'ఓటుకు నోటు'లో నారా లోకేశ్ కూ పాత్ర ఉందా?...ఆధారాల సేకరణలో తెలంగాణ ఏసీబీ!


ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్ కూ పాత్ర ఉందా? అంటే, అవుననే అంటోంది తెలంగాణ ఏసీబీ. ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులకు ఇటీవల ఓ కీలక ఆధారం దొరికిందట. కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య ఫోన్ నుంచి లోకేశ్ గొంతుతో పోలిన ఓ వ్యక్తి తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో మాట్లాడారట. సదరు గొంతు నారా లోకేశ్ దేనని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసిన తర్వాతే లోకేశ్ ప్రమేయంపై నిర్ధారణకు రావాలని వారు భావిస్తున్నారట. ప్రస్తుతం సదరు గొంతు లోకేశ్ దా? కాదా? అన్న విషయంపై ఏసీబీ ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సదరు గొంతు లోకేశ్ దని తేలితే, ఆయన పేరును కూడా త్వరలో నమోదు చేయనున్న అనుబంధ ఎఫ్ఐఆర్ లో చేర్చేందుకు కూడా ఏసీబీ సన్నాహాలు చేస్తోంది.

  • Loading...

More Telugu News