: రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా ఉంటూ...ఒక సీఎంవైపే మొగ్గితే ఎలా?: నరసింహన్ ను నిలదీసిన కేంద్రం


ఢిల్లీ పర్యటనలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు గట్టి షాకే తగిలిందట. ఢిల్లీలో మూడు రోజుల పాటు పర్యటించిన ఆయన ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా కొందరు కేంద్ర మంత్రులు నరసింహన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారట. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఉంటూ ఒక రాష్ట్రానికి చెందిన సీఎంకే అనుకూలంగా ఎలా వ్యవహరిస్తారన్న కేంద్ర మంత్రుల ప్రశ్నలకు నరసింహన్ షాక్ కు గురయ్యారట. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పేందుకు నరసింహన్ సుదీర్ఘ వివరణ ఇచ్చారట. ఈ విషయంలో తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని కేంద్ర మంత్రులు చెప్పడంతో ఆయన నోట మాట రాలేదట. ఇకనైనా ఈ తరహా ఆరోపణలు రాకుండా జాగ్రత్త వహించాలని కూడా కేంద్ర మంత్రులు నరసింహన్ కు ఆదేశాలు జారీ చేశారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News