: వరంగల్ లోక్ సభ అభ్యర్థి వేటలో టీఆర్ఎస్!
తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తన ఎంపీ పదవికి నిన్న రాజీనామా చేయడంతో, ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక బరిలో ఎవరిని నిలపాలన్న అంశంపై టీఆర్ఎస్ మల్లగుల్లాలు పడుతోంది. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్న ఎర్రోళ్ల శ్రీనివాస్ ను వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక బరిలోకి దించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. యువకుడిగానే కాక వేగంగా స్పందించడంలో దిట్టగా పేరుగాంచిన ఎర్రోళ్లకు గతంలోనే సీటివ్వాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల ఇవ్వలేకపోయామని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక సీఎం అవకాశమిస్తే పోటికి తాను కూడా సై అంటున్నారు ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి. అయితే ఖమ్మం జిల్లాకు చెందిన ఈయన అభ్యర్థిత్వం పట్ల కేసీఆర్ అంత సానుకూలంగా లేనట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ వివేక్ ను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించి వరంగల్ టికెట్ ఆయనకే ఇస్తారన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి.