: కోహ్లీ 2012లోనే కెప్టెన్ కావాల్సిందట!


టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ 2012లోనే ఎంపిక కావాల్సిందని అప్పటి సెలక్షన్ కమిటీ సభ్యుడు రాజా వెంకట్ చెప్పారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, అప్పట్లో కోహ్లీకి టీమిండియా పగ్గాలు అప్పగిద్దామని ఎంతగానో ప్రయత్నించామని అన్నారు. వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాలేదని ఆయన వెల్లడించారు. 2008లో అండర్ 19 జట్టు కెప్టెన్ గా కోహ్లీ భారత్ కు వరల్డ్ కప్ అందించినప్పుడు ఆయనలోని నాయకత్వ లక్షణాలు గుర్తించినట్టు ఆయన తెలిపారు. కాగా, ప్రస్తుతం కోహ్లీ బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఏకైక టెస్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News