: 'పీకే' సినిమా చైనాలో కూడా వంద కోట్లు వసూలు చేసిందని సంబరాలు
దేశాలతో సంబంధం లేకుండా 'పీకే' సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పలు వివాదాల కారణంగా యూఎస్ లో ముందుగా విడుదలైన 'పీకే' సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, భారత్ లో విడుదలైంది. బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొడుతూ, పలు దేశాల్లో విడుదలైంది. భారత్ లాంటి పరిస్థితులున్న చైనాలో సబ్ టైటిల్స్ తో డబ్బింగ్ సినిమాగా మే 22న 4500 స్క్రీన్లపై విడుదలై వంద కోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డులకెక్కింది. దీంతో 'పీకే' బృందం బాలీవుడ్ లో మంచి పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి సినిమా తారాగణం, దీపికా పదుకునే, రణ్ వీర్ సింగ్, అనిల్ కపూర్, ఇతర నటీనటులు హాజరయ్యారు. సినిమా విజయం పట్ల అమీర్ ఖాన్, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ హర్షం వ్యక్తం చేశారు.