: 67 మంది ప్రాణాలు కాపాడిన దంపతులు


సాధారణంగా ఒకరిద్దరి ప్రాణాలు కాపాడడమే కష్టం, అలాంటిది 67 మంది ప్రాణాలు కాపాడడమంటే మాటలా? ఇంచుమించు అసాధ్యమనుకున్న ఘటనను సుసాధ్యం చేశారు ఓ దంపతులు. చైనాలోని గుయ్ ఝా ప్రావిన్స్ లోని ఓ పట్టణంలోని ఏడంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ల్యూకైసు అనే మహిళ భర్తతో కలిసి కిరణా షాపు నిర్వహిస్తోంది. గత సోమవారం ఎప్పట్లాగే షాపు కట్టేసి నిద్రపోయింది. అర్ధరాత్రి సయమంలో ఏదో శబ్దం రావడంతో దొంగలేమోనని చుట్టూ కలియతిరిగారు. ఎవరూ కనపడకపోడంతో మళ్లీ నిద్రపోయారు. ఇంతలో తెల్లవారుజామున మరోసారి వారికి మెలకువ వచ్చింది. దీంతో బయటికి వచ్చి చూసిన ఆ దంపతులు ఆశ్చర్యపోయారు. వారున్న అపార్ట్ మెంట్ బీటలు వారుతోంది. బద్దలై భూమిలో కూరుకుపోతుందని గమనించిన ఆ దంపతులు మరో ఆలోచన లేకుండా అపార్ట్ మెంట్ ఏడు అంతస్తులు ఎక్కి ప్రతి ఇంటి తలుపుతట్టి అందులో నివాసం ఉండే 67 మందిని బయటికి తీసుకొచ్చారు. వారు లేచిన అరగంటకి ఆ ఏడంతస్తుల అపార్ట్ మెంట్ నేలమట్టమైపోయింది. దీంతో అపార్ట్ మెంట్ వాసులంతా వారిని అభినందించారు.

  • Loading...

More Telugu News