: ప్రపంచ దాతల సమావేశానికి మోదీని ఆహ్వానించిన నేపాల్ ప్రధాని


నేపాల్ లో ఈ నెల 25న ప్రపంచ దాతల సదస్సు జరగనుంది. ఖాట్మండూ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి రావాలనంటూ నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ఈ మేరకు కోయిరాలా ఫోన్లో మాట్లాడారు. అంతేగాకుండా, దేశ ఆర్థిక మంత్రి రామ్ చంద్ర మహత్ ను ఢిల్లీ పంపాలని కోయిరాలా నిర్ణయించారు. కాగా, కోయిరాలా ఆహ్వానం పట్ల మోదీ సానుకూలంగానే స్పందించారట. ఒకవేళ తాను ఖాట్మండూ రాలేకపోతే, భారత్ నుంచి ఓ ఉన్నత స్థాయి కమిషన్ వస్తుందని చెప్పారు. ఫోన్లో మాట్లాడిన సందర్భంగా కోయిరాలా భారత ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపించారట.

  • Loading...

More Telugu News