: తమిళనాడులో ఆ ఆటను రద్దు చేయండి: కేంద్ర మంత్రి జవదేకర్ కు సోనాక్షి సిన్హా విజ్ఞప్తి


తమిళనాడుతో బాటు మరికొన్ని రాష్ట్రాల్లో సంప్రదాయ క్రీడగా పేరుపొందని జల్లికట్టును నిషేధించాలని ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కు ట్విట్టర్లో విజ్ఞప్తి చేశారు. నోరులేని మూగజీవాలను హింసించడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించింది. సంప్రదాయం పేరిట ఎద్దులను హింసించడాన్ని ఆపాలని ఆమె డిమాండ్ చేసింది. వికృత క్రీడకు స్వస్తి పలకాలని, ఈ ఆటలను నిషేధిస్తే ఫలితం ఉంటుందని అభిప్రాయపడింది. ప్రముఖ జంతు సంరక్షణ సంస్థ పెటా తరఫున సోనాక్షి గతంలో పనిచేసింది.

  • Loading...

More Telugu News