: క్లాసులు పీకడం వల్ల ఉపయోగం లేదు!: రాహుల్ ద్రవిడ్
భారత్ ఏ, భారత్ అండర్ 19 జట్ల కోచ్ గా నియమితుడైన తరువాత రాహుల్ ద్రవిడ్ తొలిసారి మాట్లాడారు. కోచింగ్ అంటే క్లాసు పీకడం కాదని తన అభిమతాన్ని చాటాడు. వర్ధమాన ఆటగాళ్లకు క్లాసులు పీకడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లు సాధించాల్సిన విషయంపై ఆసక్తి పెంచాలని అన్నాడు. టీమిండియాలో చోటు సంపాదించేందుకు అవసరమైన జ్ఞానం, దేశానికి విజయాలు సాధించిపెట్టే నైపుణ్యమున్నవారిగా వారిని తయారు చేస్తే చాలని ద్రవిడ్ పేర్కొన్నాడు. తన అనుభవాలను పంచుకుంటూ, వారి లక్ష్యాన్ని చేరుకునేందుకు సహాయపడతానని ద్రవిడ్ తెలిపాడు.