: ఆధారాలున్నా చంద్రబాబుపై ఎందుకు కేసు పెట్టలేదని కేంద్ర హోంమంత్రిని అడిగా: జగన్


ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించి ఆడియో, వీడియో ఆధారాలున్నా ఎందుకు కేసు పెట్టలేదని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను అడిగినట్టు వైసీపీ అధినేత జగన్ తెలిపారు. ఈ కేసులో బాబును ఏ1 ముద్దాయిగా చేర్చి, చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ఢిల్లీలో రాజ్ నాథ్ తో భేటీ ముగిసిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారాన్ని చంద్రబాబు పక్కదోవ పట్టిస్తున్నారని, ఈ విషయాన్ని రెండు రాష్ట్రాల సమస్యగా మారుస్తున్నారని వివరించానని అన్నారు. ఈ ఏడాదిలో ఆయన పది కుంభకోణాలకు పాల్పడ్డారని, ఏపీని స్కామాంధ్రప్రదేశ్ గా తయారు చేశారని జగన్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News