: యూట్యూబ్ లో 8కే-4320 పిక్సెల్ లో చిత్రీకరించిన వీడియో 'ఘోస్ట్ టౌన్'... మీరూ చూస్తారా?


అది 2:08 నిమిషాల నిడివి వున్న వీడియో. అమెరికాలోని ఓ గని ప్రాంతంలో ఖాళీ అయిన ఊరిపై తీసిన వీడియో. పేరు 'ఘోస్ట్ టౌన్'. దీని ప్రత్యేకత ఏంటంటే '8కే'లో చిత్రీకరించడమే. అంటే, యూట్యూబ్ వీడియోల్లో 240, 320, 480, 720 (హెచ్ డీ) ఇలా క్వాలిటీని తెలిపే పిక్సిల్ రేట్ ఉంటుందని తెలుసుగా? ఈ వీడీయో ఏకంగా 4320 పిక్సెల్ క్వాలిటీతో ఉంటుంది. ప్రస్తుత నెట్ బ్యాండ్, యూట్యూబ్ ప్లేయర్ మద్దతుతో ఈ పిక్సెల్ రేంజ్ లో వీడియోను ఎవరూ చూడలేరు. ఎఫ్ యూహెచ్ డీ (ఫుల్ అల్ట్రా హై డెఫినిషన్) రేంజ్ లో 7680 X 4320 పిక్సెల్ లో ఒక్కో ఫ్రేమ్ 33.2 మెగాబైట్ల సామర్థ్యంతో వీడియో ఉంటుంది. ఇది శాటిలైట్ సాయంతో మన సినిమా థియేటర్లలో ప్రదర్శించే చిత్రం క్వాలిటీ స్థాయితో పోలిస్తే రెండు రెట్ల అధిక పిక్సెల్ కెపాసిటీని కలిగివుంటుంది. ఆ వీడియోను 8కేలో కాకపోయినా, కాస్తంత రెజల్యూషన్ తగ్గించుకుని ఇప్పటికే 16 లక్షల మందికి పైగా చూసేశారు. మీరూ చూస్తారా? ఈ లింకును క్లిక్ చేయండి మరి... Watch the Video

  • Loading...

More Telugu News