: యూసఫ్ గూడ స్టేట్ హోంలో ముగ్గురు యువతుల ఆత్మహత్యాయత్నం
హైదరాబాదులోని యూసఫ్ గూడ స్టేట్ హోంలో ముగ్గురు యువతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం సంచలనం కలిగిస్తోంది. స్టేట్ హోంలోని ముగ్గురు యువతులు సోప్ వాటర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇది గమనించిన స్టేట్ హోంలోని సహచరులు నిర్వాహకులకు సమాచారం అందించడంతో వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, వారి ఆత్మహత్యా యత్నానికి కారణాలపై ఆరా తీసేందుకు విచారణ చేపట్టిన పోలీసులు వారిని వాంగ్మూలం అడుగుగా, తమను న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. గతంలో వ్యభిచార ఆరోపణలపై అరెస్టైన సినీ నటి శ్వేతబసుప్రసాద్ ఇదే స్టేట్ హోంలో ఆశ్రయం పొందిన సంగతి తెలిసిందే.