: కేసీఆర్ పై విరుచుకుపడ్డ ముద్దుకృష్ణమ


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు విరుచుకుపడ్డారు. నీతిమాలిన పనులు చేసిన కేసీఆర్ నీతులు వల్లిస్తున్నాడంటూ మండిపడ్డారు. ఉద్యమం పేరు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఆస్తులు సంపాదించింది అతని కొడుకు, కూతురు, మేనల్లుడు కాదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజాక్షేత్రంలో ఇతరపార్టీల గుర్తులపై పోటీ చేసి విజయం సాధించిన వారిని పదవుల ఆశ చూపి, పార్టీలో చేర్చుకుని, ఇప్పుడు టీడీపీపై బురద జల్లాలని చూస్తున్న కేసీఆర్ ని పిరికిపందగా ఆయన అభివర్ణించారు. పాస్ పోర్టుల కుంభకోణానికి పాల్పడింది ఎవరో ప్రజలందరికీ తెలుసని, అలాంటి అవినీతిపరుడు టీడీపీపై విమర్శలు గుప్పించడం దెయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుందని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News