: నేతాజీని ఓడించడమే బ్రిటన్‌ యుద్ధాల్లో అతిగొప్పది


ఒకప్పట్లో రవి అస్తమించని సువిశాల సామ్రాజ్యంగా పరిఢవిల్లినదంటే.. బ్రిటిష్‌ సామ్రాజ్యం ఎంతటి శత్రుభయంకరమైనదో కదా అని మనకు అనిపిస్తుంది. వారు చరిత్రలో ఎంతటి మహా యుద్ధాలను సాగించారో కదా అనిపిస్తుంది. అయితే బ్రిటన్‌కు సంబంధించినంత వరకు వారి దళాలు పాల్గొన్న యుద్ధాల్లోకెల్లా మేటి ఏదని ఓ పోల్‌ నిర్వహిస్తే... వారు భారత్‌ను ఆక్రమించుకుని పాలిస్తున్న కాలంలో.. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ తన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌తో వారి మీద దాడికి వచ్చినప్పుడు సాధించిన విజయమే ఘనమైనదని వారు కీర్తించుకుంటున్నారు. అప్పట్లో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ స్థాపించిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌.. జపాన్‌ దళాలతో కలిసి 1944లో భారత్‌లోని బ్రిటన్‌ బలగాలపై దాడి చేశారు. కోహిమా, ఇంఫాల్‌ల్లో ఈ పోరాటం భీకరంగా జరిగింది.

నేతాజీ బలగాల్లోని 53 వేల మంది నిహతులయ్యారు లేదా గల్లంతయ్యారు. బ్రిటన్‌ దళాల్లో ఇంఫాల్లోనే 12500 మంది, కోహిమాలో నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

బ్రిటన్‌ వారి గొప్పయుద్ధం ఏమిటి అనే విషయంలో లండన్‌లోని నేషనల్‌ ఆర్మీ మ్యూజియం వారు నిర్వహించిన ఈ పోల్‌ పోటీలో దాదాపు సగం ఓట్లు.. నేతాజీపై సాధించిన విజయానికే దక్కాయి.

  • Loading...

More Telugu News