: ప్రతీకారం కోసం పొంచివున్నారు: నిఘా వర్గాల హెచ్చరిక
సరిహద్దులు దాటి మయన్మార్ లోకి చొచ్చుకెళ్లి భారీ సంఖ్యలో మిలిటెంట్లను హతమార్చిన తరువాత ప్రతీకారం తీర్చుకునేందుకు ఎన్ఎస్సీఎన్-కే దళాలు భారత్ లోకి ప్రవేశించాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. సరిహద్దుల్లో ఉన్న భారత సైన్యం అప్రమత్తంగా ఉండాలని, ఏ క్షణమైనా ప్రతీకార దాడులు జరగవచ్చని తెలిపాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని పలుచోట్ల మిలిటెంట్ల బృందాలు ఉన్నట్టు సమాచారం అందిందని నిఘా వర్గాలు తెలిపాయి. కాగా, నిన్న భద్రతాదళాలు జరిపిన మెరుపు దాడుల్లో 100 మందికి పైగా మిలిటెంట్లు ప్రాణాలను పోగొట్టుకున్న సంగతి తెలిసిందే.