: చంద్రబాబు ఫిర్యాదుపై కదలిన కేంద్రం... ఫోన్ ట్యాపింగ్ పై విచారణకు ఆదేశం


తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పై సీఎం చంద్రబాబు చేసిన ఫిర్యాదుతో కేంద్ర ప్రభుత్వం కదిలింది. ఈ మేరకు శాఖాపరమైన అంతర్గత విచారణ చేపట్టాలంటూ కేంద్రం ఆదేశించింది. దానికి సంబంధించి నేరుగా ప్రధాని కార్యాలయం నుంచే నిన్న(బుధవారం) రాత్రి ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. అయితే విచారణ ఏ శాఖ చేపట్టాలన్న దానిపై స్పష్టత లేనప్పటికీ, కేంద్ర హోంశాఖ లేదా టెలీ కమ్యూనికేషన్ల శాఖ విచారణ చేస్తుందని అంటున్నారు. నిన్న ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలసి గంట పాటు మాట్లాడారు. ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ పై ప్రధానికి ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన ఆధారాలను మోదీకి నివేదిక రూపంలో అందజేశారు. ఈ నేపథ్యంలో విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్రం తక్షణమే దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

  • Loading...

More Telugu News