: బాలయ్యా! కాస్త ఓపిక పట్టు... తదుపరి అవకాశం నీదే!: టీ మంత్రి తలసాని


సైకిల్ దిగి కారు ఎక్కిన తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కొద్దిసేపటి క్రితం టీడీపీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎం పదవిని వదిలితే ఆ తర్వాత అవకాశం టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణదేనని తలసాని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు తీరుపై తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రత కోసం ఏపీ పోలీసులను నియమించుకున్న చంద్రబాబు, నీటిని కూడా అక్కడి నుంచే తెచ్చుకుంటారా? అని ప్రశ్నించారు. కేసులో దోషిగా తేలిన తర్వాత ఎలాగూ చంద్రబాబు తన పదవికి రాజీనామా చేయక తప్పదన్న భావన వచ్చేలా మాట్లాడిన తలసాని, ఆ తర్వాత అధికార పగ్గాలు బాలయ్య చేతికి చిక్కడం ఖాయమని చెప్పారు. ‘‘బాలయ్యా, కాస్త ఓపిక పట్టు. తదుపరి అవకాశం నీకే దక్కుతుంది’’ అని తలసాని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News