: ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి 20 సీట్లు కూడా రావు: విజయసాయిరెడ్డి
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు, ఇందులో సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీని మరింత దెబ్బతీయాలని వైసీపీ చూస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు ప్రజాభిమానాన్ని కోల్పోయారని, ఇప్పుడు గనుక ఎన్నికలు జరిగితే టీడీపీకి 20 సీట్లు కూడా రావని ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం భ్రష్టుపట్టడానికి తొమ్మిదేళ్లు పడితే, ఇప్పుడు ఏడాదికే ఆ ప్రభుత్వం భ్రష్టుపట్టిందని దుమ్మెత్తి పోశారు.