: సినిమా ఇంకా అయిపోలేదు: హాట్ టాపిక్ గా మారిన కేసీఆర్ వ్యాఖ్య
'ఓటుకు నోటు' వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి సంబంధించిన సినిమా ఇంకా అవలేదని, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో చూడాల్సింది ఎంతో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రూ. 150 కోట్లతో బాబు కొనుగోళ్ల వ్యవహారం నడిపారని కూడా ఆయన అన్నారు. ఈ కేసులో తెలంగాణ సర్కారు దగ్గర మరిన్ని ఆధారాలు ఉండబట్టే కేసీఆర్ అలా మాట్లాడి వుంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, ఈ వ్యవహారంలో ఇంకొన్ని ఆధారాలు లీక్ కావచ్చన్న ప్రచారం జరుగుతోంది. రేవంత్ వెనుక ఉన్నది చంద్రబాబేనని ఇప్పటికే కేసీఆర్ పలుమార్లు ప్రస్తావించిన నేపథ్యంలో బాబుకు నోటీసులు పంపే విషయంలో ఏసీబీ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నట్టు సమాచారం.