: నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే ‘పాలమూరు’ పనులు: టీ సీఎం కేసీఆర్
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్వాసితులపై తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ప్రాజెక్టు నిర్మాణం కారణంగా నిరాశ్రయులవుతున్న కుటుంబాలకు అన్ని రకాలుగా పరిహారం అందజేసిన తర్వాతే ప్రాజెక్టు పనులు చేపడతామని ఆయన ప్రకటించారు. మహబూబ్ నగర్ జిల్లా కరివేనలో కొద్దిసేపటి క్రితం ఆయన ప్రాజెక్టు పైలాన్ ను ఆవిష్కరించారు. అనంతరం భూత్పూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రాజెక్టు కిందే సాగు భూమితో పాటు డబుల్ బెడ్ రూం ఇళ్లను కట్టించి ఇస్తామని ప్రకటించారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఓ ఉద్యోగం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. వీటన్నింటినీ నెరవేర్చిన తర్వాతే ప్రాజెక్టు పనులను చేపడతామని కేసీఆర్ స్పష్టం చేశారు.