: నీ లాంటి పనిచేస్తే... మోదీనైనా చట్టం వదలదు: చంద్రబాబుపై తుమ్మల ఫైర్


ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైరయ్యారు. చేసిన అవినీతి పని చాలక మళ్లీ ఢిల్లీకెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను కలుస్తూ చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాదులోని తెరాస భవన్ నుంచి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన తుమ్మల, ఢిల్లీకెళ్లిన చంద్రబాబు తెలుగు ప్రజల పరువు తీశారని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో తాము ఊరుకున్నా, చట్టం చేతులు ముడుచుకు కూర్చోదని తుమ్మల తేల్చిచెప్పారు. చంద్రబాబు చేసిన పని నరేంద్ర మోదీ చేసినా, ప్రధానిని సైతం చట్టం వదలదని ఈ సందర్భంగా తుమ్మల చెప్పారు. ఆడియో టేపుల్లోని గొంతు తనదా? కాదా? అన్న విషయాన్ని చంద్రబాబు ఇంకా స్పష్టం చేయలేదన్నారు. సెక్షన్ 8ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని తుమ్మల ఆరోపించారు.

  • Loading...

More Telugu News