: స్నేహితుడిగా రేవంత్ కు అండగా ఉంటాం: నాగం జనార్దన్ రెడ్డి
టీ.టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు వ్యవహారంపై బీజేపీ తరపున నాగం జనార్దన్ రెడ్డి తొలిసారి స్పందించారు. స్నేహితుడిగా రేవంత్ కు అండగా నిలబడతానని, ఆయనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని చెప్పారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ పై నాగం మండిపడ్డారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, రాజ్యాంగ విరుద్ధంగా 13మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకోవడం దుర్మార్గమని అన్నారు. కేసీఆర్ తీరుపై కలసికట్టుగా అందరం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. అయితే మిత్రపక్షంగా పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తానని నాగం తెలిపారు.