: బాహుబలి యూనిట్ కు మరో షాక్... ఇంటర్నెట్ లో చిత్రం పాటలు లీక్
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన టాలీవుడ్ సంచలన చిత్రం 'బాహుబలి'కి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఈ చిత్రంలోని కొన్ని పోరాట సన్నివేశాలు గతంలో లీకైన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలోని పాటలు కూడా లీకయ్యాయట. ప్రస్తుతం ఈ చిత్రంలోని పాటలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. చిత్రం ప్రమోషన్ లో భాగంగా రోజుకో పోస్టర్ చొప్పున రిలీజ్ చేసిన చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ త్వరలో జరగనుంది. ఈ నేపథ్యంలో చిత్రం పాటలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది.