: రేవంత్ కు నైతిక స్థైర్యం ఇచ్చేందుకే వచ్చాం: మంత్రి గంటా
పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి నైతిక స్థైర్యం ఇచ్చేందుకే తామంతా ఆయన కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. పార్టీ ఆయనకు అండగా ఉంటుందని చెప్పారు. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన రేవంత్ కూతురు నైమిశ నిశ్చితార్థానికి గంటా వచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసు నుంచి రేవంత్ నిర్దోషిగా బయటకు వస్తారన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.