: ఏపీలో ఈ నెల 24 నుంచి లారీల బంద్


డీజీల్ పై వ్యాట్ పెంపుకు నిరసనగా బంద్ చేయాలని ఏపీ లారీ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఉదయం విజయవాడలో ఏపీ లారీ అసోసియేషన్ సమావేశమైంది. ఈ నెల 24 నుంచి బంద్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పొరుగు రాష్ట్రాల్లో వ్యాట్ తక్కువగా ఉండటంతో డీజిల్ తక్కువ ధరకు వస్తోందని, కానీ ఏపీలో వ్యాట్ పెంచడంతో కొనలేకపోతున్నామని లారీ యజమానులు అంటున్నారు. వ్యాట్ తగ్గించాలని నాలుగు నెలలుగా విజ్ఞప్తి చేస్తున్నా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంక్ లు మూసివేసి బంద్ లో పాల్గొనాలని పెట్రోల్ బంక్ యజమానులు నిర్ణయించుకున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News