: డ్రగ్స్ తో పట్టుబడ్డ ఐటీ కంపెనీ సీఈఓ... చెన్నైలో కలకలం


ఓ ప్రముఖ ఐటీ కంపెనీకి చెందిన సీఈఓ డ్రగ్స్ తో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో నిన్న జరగిన ఈ ఘటన సాఫ్ట్ వేర్ వర్గాల్లో కలకలం రేపింది. వివరాల్లోకెళితే... చెన్నై కేంద్రంగా ఈ-పబ్లిషింగ్ రంగంలో పేరెన్నికగన్న ఐటీ కంపెనీ ‘జోవే ఇండియా లిమిటెడ్’కు సంజీవ్ భట్నాగర్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. చెన్నైలోని తారామణికి చెందిన రాజీవ్ గాంధీ శాలైలోని సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఆవరణలోని తన కార్యాలయం నుంచి నిన్న మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో రాజీవ్ బయలుదేరారు. నేరుగా వాల్ ట్యాక్స్ రోడ్డులోని ఎస్ఎంపీకే కార్గో అండ్ కొరియర్ ఆఫీస్ కు వెళ్లారు. అక్కడ తన పేరిట వచ్చిన ఓ పార్సిల్ ను ఆయన తీసుకున్నారు. దీనిపై అంతకుముందుగానే విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అక్కడ మాటు వేసి ఆయనను అదుపులోకి తీసుకుంది. రాజీవ్ చేతిలోని పార్సిల్ ను తెరచి చూసిన ఎన్సీబీ అధికారులకు అందులో 3.88 గ్రామ్స్ కొకైన్ లభించింది. దీంతో రాజీవ్ తో పాటు అతడి కారు డ్రైవర్ తులసిని కూడా ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసి తమ వెంట తీసుకెళ్లారు. భర్త ఎంతకీ ఇంటికీ తిరిగిరాకపోవడంతో రాజీవ్ భార్య అఖిలాండేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా రాజీవ్ ఎన్సీబీ అదుపులో ఉన్నారని చెన్నై పోలీసులు తేల్చారు.

  • Loading...

More Telugu News