: నాడు పంట నష్టంపై రాహుల్ గాంధీకి మొర... నేడు సాయం అందక ఆత్మహత్య


దాదాపు ఆరు వారాల క్రితం... ఏప్రిల్ 28న రాహుల్ గాంధీ పంజాబ్ లో పర్యటిస్తున్న సమయంలో, తెల్లని టర్బన్ ధరించిన సూర్జిత్ సింగ్ అనే ఓ రైతు పంట నష్టం గురించి వేలెత్తి చెబుతూ ఉన్న చిత్రం జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైంది. పంట దిగుబడి రాక, అప్పులు తీర్చే మార్గం లేక నేడు ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలో కలకలం సృష్టించింది. అకాల వర్షాల కారణంగా తామెలా నష్టపోయామన్న విషయాన్ని రాహుల్ అంతటి నేతకు వివరించి చెప్పిన సూర్జిత్, కేంద్రం నుంచి ఏ విధమైన సాయాన్నీ అందుకోలేకపోయాడు. ఆదుకుంటామని స్వయంగా చెప్పిన రాహుల్ కూడా ఆపై పట్టించుకోలేదు. కాగా, సూర్జీత్ మొత్తం రూ.7 లక్షలను పంట కోసం రుణంగా తీసుకున్నారని, గోధుమ పంట వేశాడని, మార్చి, ఏప్రిల్ మాసాల్లో కురిసిన అకాల వర్షానికి పంట చేతికందకపోవడంతో అప్పుల భారం పెరిగిందని పోలీసులు తెలిపారు. దీంతో సూర్జీత్ ఆత్మహత్య చేసుకున్నాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా, ఈ సంవత్సరం పంజాబ్ లో అకాల వర్షాలు మొత్తం 7 లక్షల ఎకరాల్లో పంటను తుడిచిపెట్టాయి.

  • Loading...

More Telugu News