: రేవంత్ కుమార్తె నైమిశ నిశ్చితార్థ వేడుక ప్రారంభం... తరలివస్తున్న బంధువులు, టీడీపీ నేతలు


తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశారెడ్డి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో మొదలైంది. రేవంత్, భార్య గీత, వారి కూతురు ప్రస్తుతం నిశ్చితార్థ పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బంధువులు, టీడీపీ నేతలు భారీగా తరలివస్తున్నారు. మరికాసేపట్లో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారు. రాజకీయ నేతలతో మాట్లాడటంగానీ, ఏకాంత భేటీలు జరపడంగానీ చేయకూడదని నిన్న (బుధవారం) బెయిల్ ఇచ్చిన సమయంలో ఏసీబీ కోర్టు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కన్వెన్షన్ సెంటర్ బయట, లోపల ఏసీబీ అధికారులు సివిల్ డ్రెస్ లో రేవంత్ ను ఫాలో అవుతున్నారు.

  • Loading...

More Telugu News