: మ్యాగీ దారిలోనే 'నార్', ముందు జాగ్రత్తపడ్డ హెచ్ యూఎల్... మార్కెట్ నుంచి సరుకంతా వెనక్కి


మ్యాగీ విషయంలో నెస్లే సంస్థ పడ్డ ఇబ్బందులు తాము పడరాదని భావిస్తున్న హిందుస్థాన్ యూనీలివర్ ముందే జాగ్రత్తపడింది. మార్కెట్లో 'నార్' బ్రాండ్ పేరిట ఉన్న నూడుల్స్ మొత్తాన్ని వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ ప్రొడక్టుకు కేంద్ర ఆహార భద్రతా నియంత్రణ విభాగం ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతి లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. చైనీస్ రేంజ్ అంటూ హచ్ యూఎల్ 'నార్' పేరిట పలు రకాల నూడుల్స్ వెరైటీలను మార్కెటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి అనుమతులు వచ్చే వరకూ నూడుల్స్ తయారీ నిలిపివేయాలని నిర్ణయించామని, విక్రయాలు కూడా జరపబోమని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. తమ ప్రొడక్టులు పూర్తి క్వాలిటీతో కూడినవని, అందులో ఏ విధమైన సందేహం లేదని సంస్థ వివరించింది. మరిన్ని ఇన్ స్టంట్ ఫుడ్స్ ను పరీక్షలకు పంపనున్నామని సోమవారం నాడు ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించిన నేపథ్యంలో హెచ్ యూఎల్ నిర్ణయం వెలువడింది.

  • Loading...

More Telugu News