: ఓటుకు నోటు అనుబంధ ఎఫ్ఐఆర్ లో కేంద్ర మంత్రి...మరో ఇద్దరు టీడీపీ నేతలు కూడానట!


ఓటుకు నోటు కేసు మరింత మంది టీడీపీ నేతల మెడకు చుట్టుకోనుందా? అంటే, అవుననే అంటున్నాయి కేంద్ర నిఘా వర్గాలు. ఈ కేసులో అనుబంధ ఎఫ్ఐఆర్ ను నమోదు చేసేందుకు తెలంగాణ ఏసీబీ సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. కేసులో కీలక నిందితుడు రేవంత్ రెడ్డి సహా మరో ఇద్దరు నిందితులు సెబాస్టియన్, ఉదయ సింహలను నాలుగు రోజుల పాటు విచారించిన ఏసీబీ అధికారులు, ఈ వ్యవహారంలో డబ్బు సర్దుబాటు చేసిన నేతలెవరన్న విషయాలను రాబట్టిందట. ఈ సమాచారం ఆధారంగా టీడీపీకి చెందిన ఓ కేంద్ర మంత్రితో పాటు ఏపీకి చెందిన ఓ మంత్రి, వ్యాపారవేత్తగానే కాక టీడీపీ ఎంపీగా కొనసాగుతున్న మరో కీలక నేత పేరునూ సదరు అనుబంధ ఎఫ్ఐఆర్ లో చేర్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News