: వివాదాలు మా దాకా వస్తే... అక్కడ మీరెందుకు?: గవర్నర్ కు తలంటిన రాజ్ నాథ్


ఓటుకు నోటు వ్యవహారంతో తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ వివాదం తాజాగా దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. అయితే ఈ వివాదాన్ని ఆదిలోనే పరిష్కరించాల్సిన గురుతర బాధ్యత ఉమ్మడి రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్న ఈఎస్ఎల్ నరసింహన్ దేనని కేంద్రం వాదిస్తోంది. ఈ మేరకు నిన్న తనను కలిసిన నరసింహన్ కు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తలంటారని విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఏడాదిగా ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు పెద్దగా తలెత్తలేదని, ఈ క్రమంలోనే తనకు సంక్రమించిన విశేషాధికారాలను (సెక్షన్ 8) వినియోగించాల్సిన అవసరం రాలేదని నరసింహన్ చెప్పేందుకు యత్నించినా, రాజ్ నాథ్ అవకాశం ఇవ్వలేదట. ఇంకేదైనా చెప్పాలనుకుంటే తన శాఖ కార్యదర్శికి చెప్పాలంటూ నరసింహన్ ముఖం మీదే రాజ్ నాథ్ చెప్పేశారట. చేసేది లేక నరసింహన్ హోం శాఖ కార్యదర్శి గోయల్ వద్ద తన గోడును వెళ్లబోసుకుని వెనుదిరిగారట.

  • Loading...

More Telugu News