: ‘ఓటుకు నోటు’ కీలక అధికారికి సైబరాబాదు కమిషనర్ పోస్టు... తెలంగాణలో జోరుగా చర్చ!


ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఓ సీనియర్ పోలీసు ఉన్నతాధికారి కీలక భూమిక పోషించారట. కేసీఆర్ సర్కారు ఆదేశాల మేరకు ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకున్న ఆయన మొత్తం వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేశారు. ఈ అండర్ కవర్ ఆపరేషన్ లో రేవంత్ రెడ్డి ఆడియో, వీడియో టేపుల్లో రెడ్ హ్యండెడ్ గా పట్టుబడగా, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వాయిస్ ఆడియో టేపులకు చిక్కింది. అప్పగించిన పనిని పక్కాగా పూర్తి చేసిన సదరు అధికారికి సర్కారు సైబరాబాదు కమిషనర్ పోస్టును నజరానాగా అందించేందుకు సన్నాహాలు చేస్తోందట. ఈ విషయంపై ప్రస్తుతం తెలంగాణ పోలీసు వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట. రాష్ట్ర విభజనకు ముందు నుంచి ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న సదరు అధికారి, విభజన నేపథ్యంలో తెలంగాణ కేడర్ కు బదిలీ అయ్యారు.

  • Loading...

More Telugu News