: తీర్పు నచ్చలేదని జడ్జిని శపిస్తానన్నాడు!
నిజామాబాద్ న్యాయస్థానంలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ కేసును విచారించిన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు బాధితుడికి నచ్చకపోవడంతో ఆగ్రహించిన బాధితుడు జడ్జిని శపిస్తానంటూ బెదిరింపులకు దిగాడు. నష్టపరిహారంగా బాధితుడు 15 లక్షల రూపాయలు కావాలంటూ డిమాండ్ చేయగా, కేసు విచారించిన న్యాయమూర్తి, బాధితుడికి 5 లక్షల రూపాయలను పరిహారంగా చెల్లించాలని ఆదేశించారు. బాధితుడు తీర్పును వ్యతిరేకిస్తూ, ఆగ్రహంతో జడ్జిని శపించేందుకు పూనుకున్నాడు. దీంతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘనటకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.