: మంత్రి పరిటాల సునీత చాంబర్లో బాలకృష్ణ జన్మదిన వేడుకలు


నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం హైదరాబాదులోని ఏపీ సచివాలయానికి విచ్చేశారు. అక్కడ మంత్రి పరిటాల సునీత చాంబర్లో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. బాలయ్య మీడియాతో మాట్లాడుతూ... ఫోన్ ట్యాపింగ్ చేయడం మంచి పద్ధతి కాదని, దాన్ని తాము ఖండిస్తున్నామని అన్నారు. నీతినిజాయతీకి మారు పేరు తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఓటుకు నోటు వ్యవహారం ఓ రాజకీయ కుతంత్రం అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News