: రాజమండ్రిలో పేలుడు...సెక్యూరిటీ గార్డుకు గాయాలు
రాజమండ్రిలో పేలుడు సంభవించింది. రైల్ కం రోడ్ వంతెనకు సమీపంలో గల అపార్టుమెంటులో విస్ఫోటనం సంభవించింది. దీంతో అపార్టుమెంటు వాసులు ప్రాణభయంతో పరుగులు తీశారు. కాగా, అపార్ట్ మెంట్ లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డు గాయపడ్డాడు. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించారు. కాగా, పేలుడుకి కారణం ఏంటి? అనే దానిని స్థానికులు ఆరాతీస్తున్నారు. అయితే అది బాంబు పేలుడా? ఇంకేదైనా పేలుడా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, తీవ్రవాదులు ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతాలను టార్గెట్ చేశారంటూ కొన్ని కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. హైదరాబాదు, కర్నాటక, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో కోస్తా జిల్లాలను సేఫ్ జోన్ గా తీవ్రవాదులు భావిస్తున్నారని, దీంతో అటువైపుగా దృష్టి సారించారని పలు కథనాలు ప్రసారమయ్యాయి.