: ఇక చిత్తుకాగితాలు ఏరుకునే వారికీ అవార్డులు!


తమ తమ రంగాల్లో విశేష కృషి చేసి, ప్రతిభ చాటుకున్న వ్యక్తులకు అవార్డులు ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు చెత్త ఏరుకునే వ్యక్తులకూ అవార్డులు ఇస్తామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అంటున్నారు. ఇదో గొప్ప రంగం కాకపోయినా, ప్రాధాన్యత పరంగా విస్మరించలేనిదని ఆయన తెలిపారు. నగరాల్లో చెత్తను తొలగించకపోతే అది గుట్టలుగుట్టలుగా పేరుకుపోతుందని, అలాంటి పరిస్థితి రానీయకుండా రోజూ చెత్త ఏరుతూ వారు సమాజానికి సేవచేస్తున్నారని వివరించారు. అందుకే, వచ్చే ఏడాది నుంచి ఈ రంగంలోనూ అవార్డులు ఇస్తున్నట్టు జవదేకర్ తెలిపారు.

  • Loading...

More Telugu News