: ఎన్సీపీ అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైన శరద్ పవార్
నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శరద్ పవార్ తిరిగి ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకున్నట్టు పార్టీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. 1999లో పార్టీ స్థాపించిన నాటి నుంచి పవార్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తాజాగా పార్టీ 16వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆరవ జాతీయ సమావేశంలో పవార్ ను మళ్లీ ఎన్నుకున్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి టీపీ పీతాంబర్ వెల్లడించారు. ఈ సమావేశానికి 700 మంది నేతలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి ఆయన మేనల్లుడు, పార్టీ ఎమ్మెల్యే అజిత్ పవార్ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.