: పదిమంది విదేశీయుల నిర్వాకం వల్లే మలేసియాలో భూకంపం వచ్చిందట


పదిమంది విదేశీయుల నిర్వాకం వల్లే మలేసియాలో భూకంపం వచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మలేసియాలోని కినాబలు పర్వత ప్రాంతంలో ఇటీవల 5.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. కినాబలు పర్వతాన్ని స్థానికులు పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ పర్వతారోహణకు 10 మంది సభ్యులతో కూడిన ఓ విదేశీ బృందం వెళ్లింది. పర్వత శిఖరాన ఈ పదిమంది పర్యాటకులు నగ్నంగా ఫొటోలకు పోజులిచ్చారు. స్థానికుల ఫిర్యాదుతో ఇద్దరు కెనడియన్లు ఒక డచ్, బ్రిటన్ దేశాలకు చెందిన ఒక్కొక్కరిని మలేసియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఆరుగురి కోసం గాలిస్తున్నారు. వీరు శిఖరాగ్రాన నగ్నఫోటోలు దిగడమే కాకుండా అటుగా వచ్చిన పర్యాటకులను కూడా నగ్న చేష్టలతో ఇబ్బంది పెట్టారట. పవిత్రమైన పర్వతంపై ఇలాంటి చేష్టలకు పాల్పడడం వల్లే 5.9 తీవ్రతతో భూకంపం వచ్చిందని స్థానికులు మండిపడుతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో న్యూసెన్స్ కేసు కింద వారిని అదుపులోకి తీసుకున్నట్టు మలేసియా పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News