: ఎక్కువ కాలం బతకాలని ఉందా?...మందులేమీ వాడక్కర్లేదు...ఇలా చేయండి చాలు!


ఎక్కువ కాలం సంతోషంగా జీవించడానికి మందులేమీ వాడక్కర్లేదని, కేవలం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉల్లాసంగా వుంటే చాలని పరిశోధకులు చెబుతున్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన రాబిన్ డంబర్ చేసిన పరిశోధనలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయని పేర్కొంటున్నారు. కబుర్లు చెప్పడం మామూలే అయినప్పటికీ, ఆకట్టుకునేలా కబుర్లు చెప్పడం అన్నది జీవిత కాలాన్ని పెంచుతుందని అన్నారు. ఇలా కబుర్లు చెప్పుకోవడం వల్ల మనకు తెలిసిన, తెలియని విషయాలు దొర్లుతాయని, వీటి వల్ల జ్ఞాపకశక్తి కూడా మేల్కొంటుందని, మనం ఎవరినైనా కలిసినప్పుడు వారికి సంబంధించిన విషయాలు గుర్తుకు వస్తాయని ఆయన చెప్పారు. వారితో స్నేహం కావాలో, వద్దో కూడా మెదడు బోధిస్తుందని ఆయన వెల్లడించారు. అందువల్ల ఎవరి గురించైనా పాజిటివ్ గా మాట్లాడుకుంటే ఆయుఃప్రమాణం పెరుగుతుందని అన్నారు. చెడుగా మాట్లాడుకుంటే జీవనకాలం పెరగకపోగా, ఒత్తిడి, నెగిటివ్ ఆలోచనలు పెరిగి మానసిక వ్యాధిబారినపడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అందుకే హాయిగా మంచి కబుర్లు చెప్పుకోండి... ఆయుఃప్రమాణం పెంచుకోండి.

  • Loading...

More Telugu News