: హిందూపురంలో ఘనంగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు


సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ 56వ పుట్టిన రోజు వేడుకలు ఈరోజు అనంతపురం జిల్లా హిందూపురంలో ఘనంగా జరిగాయి. ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నేతలు, అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో కేకు కోసి మిఠాయిలు పంచారు. అనంతరం రోగులకు బాలయ్య అభిమానులు పండ్లు పంపిణీ చేశారు. బాలయ్య పేరుపై అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు.

  • Loading...

More Telugu News