: కేంద్ర విజిలెన్స్ కమిషనర్ గా కేవీ చౌదరి ప్రమాణస్వీకారం
కేంద్ర విజిలెన్స్ కమిషనర్ గా కేవీ చౌదరి, కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్ గా విజయ్ శర్మ ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రణబ్ ముఖర్జీ వారిచేత ప్రమాణస్వీకారం చేయించారు. రెండు రోజుల కిందటే వారిద్దరి నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కృష్ణాజిల్లా కురుమద్దాలికి చెందిన కొసరాజు వీరయ్య చౌదరి ఐఆర్ఎస్ మాజీ అధికారి. విజయ్ శర్మ ఉత్తరప్రదేశ్ కు చెందిన ఐఏఎస్ మాజీ అధికారి.