: చక్కెర పరిశ్రమకు తీపి వార్త... వడ్డీ రహిత రుణానికి కేంద్రం ఆమోదం


చక్కెర పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం తీపి వార్త అందించింది. సంక్షోభంలో కూరుకుపోయిన చక్కెర పరిశ్రమకు వడ్డీ రహిత రుణాన్ని అందజేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఆరువేల కోట్ల రూపాయలను కేంద్రం ఇవ్వనుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మీడియా సమావేశంలో వెల్లడించారు. దాంతో చక్కెర మిల్లుల యజమానులు చెరకు రైతుల బకాయిలను చెల్లించేందుకు వీలు కల్పించినట్టైంది. చెరకు రైతులకు చక్కెర మిల్లుల యాజమానులు చెల్లించాల్సిన బకాయిలు రూ.19వేల కోట్ల వరకు ఉన్నట్టు అంచనా.

  • Loading...

More Telugu News